Friday, April 17, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలరానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగురు వేస్తాం.. షేక్ ముఖిమ్

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగురు వేస్తాం.. షేక్ ముఖిమ్

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేద్దామని స్థానిక సీనియర్ కాంగ్రెస్ నాయకులు షేక్ ముఖిమ్ అన్నారు.ఈ మేరకు శుక్రవారం పట్టణ కొమిరెడ్డి నివాస పార్టీ కార్యాలయంలో స్థానిక పార్టీ ప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఎన్నికైన వార్డు కౌన్సిలర్లు అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రజా సొమ్మును ఇష్టానుసారంగా దోచుకున్నారని మండిపడ్డారు. 12వ వార్డులో స్థానిక వార్డు కౌన్సిలర్ దాటికి తట్టుకోలేక అక్కడి ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి జంకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, నల్లల సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మిషన్ భగీరథ త్రాగునీటి పథకం అప్పటి పాలకులు, కాంట్రాక్టర్లకు కాసుల పథకంగా మారిందని, దాంతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ధ్వజమెత్తారు. అవినీతికి కేరాఫ్ గా నిలిచిన గత వార్డ్ కౌన్సిలర్లను ఓడించి అభివృద్ధికి పట్టం కడదామని అన్నారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, టిపిసిసి సీనియర్ నాయకులు కొమిరెడ్డి కరంచంద్ లు బలపరిచిన అభ్యర్థిని వార్డు ప్రజలు గెలిపించాలని కోరారు. తన ఆధ్వర్యంలో శనివారం నాడు 12వ వార్డుకు చెందిన బిజెపి, టిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నర్సింగరావు కరంచంద్ ల సమక్షం లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని షేక్ ముఖిమ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular