Thursday, April 16, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలవెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అభివృద్ధి,సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తా.. డా.రఘు.

వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అభివృద్ధి,సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తా.. డా.రఘు.

📰 Generate e-Paper Clip

నవగీతం,మెట్ పల్లి

వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అభివృద్ధి, సభ్యుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని డాక్టర్ రఘు అన్నారు.జగిత్యాల జిల్లా గౌరవ అధ్యక్షులుగా మెట్ పల్లి నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ చిట్నేని రఘు నియామకం అయినట్లు జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఉరుమండ్ల మహేష్ బుధవారం తెలిపారు. వెయిట్ లిఫ్టింగ్ క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల సంక్షేమానికి, అదేవిధంగా జిల్లాలో యువ క్రీడాకారులను మరింత ప్రోత్సహించడానికి డాక్టర్ రఘు కృషి చేస్తారని పేర్కొంటూ ఈ నియామకం జరిపినట్లు తెలిపారు. జిల్లాలో వెయిట్ లిఫ్టింగ్ క్రీడను మరింత ప్రోత్సహించడానికి డాక్టర్ రఘు సలహాలను, సూచనలను పాటిస్తామని పేర్కొన్నారు. డాక్టర్ రఘు నియామకం పట్ల అసోసియేషన్ సభ్యులు, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.కాగా నూతనంగా జగిత్యాల జిల్లా గౌరవ అధ్యక్షులుగా నియమితులైన డాక్టర్ రఘు మాట్లాడుతూ తన నియామకం పట్ల సహకరించిన అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular