గర్భిణీ స్త్రీలకు ఉచిత ఆటో సేవలు
నవగీతం,వైరా,
వైరా మండలం సిరిపురం(కేజీ) గ్రామంలో ఆటో డ్రైవర్ లతీఫ్ గర్భిణీ స్త్రీలకు ఉచిత ఆటో సర్వీస్ సేవలను అందిస్తున్నారు.ఆయన ప్రతిరోజు మండలంలోని గర్భిణీ స్త్రీలకు ,వారి కుటుంబాలు ఫోన్ చేస్తే వారి ఇంటికి వెళ్లి ఉచితంగా ఆటోలో ఎక్కించుకొని ఆసుపత్రికి తీసుకెళ్లి మరల ఎక్కించుకొని వారి ఇంటిదగ్గర విడిచి పెడుతున్నాడు. సోమవారం రోజున వైరా మండలం పుణ్యపురం గ్రామానికి చెందిన జువ్వ ఉమామహేశ్వరి అనే గర్భిణీ స్త్రీని టెస్టుల నిమిత్తం ఖమ్మం హాస్పటల్ కి తీసుకువెళ్లి మరల గర్భిణీ స్త్రీని ఇంటి వద్ద దింపి రావడం జరిగింది.ఇలా 24 గంటలు ఉచితంగా గర్భిణీ స్త్రీలకు సేవ చేస్తున్నాడు.ఇది చూసిన గ్రామ ప్రజలు శభాష్ లతీఫ్ బాయ్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తిని మండలంలోని పలువురు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

