నవగీతం, మల్లాపూర్
మల్లాపూర్ మండలం సిరిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ. శ్రీనివాస్ అధ్యక్షతన, అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ ఇబ్రహీంపట్నం ఆధ్వర్యంలో పదవ తరగతి వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకొని అత్యుత్తమ గ్రేడ్ లు సాధించాలనే ఉదేశ్యంతో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను ఉచితంగా అందజేశారు.ఈ సందర్బంగా సంస్థ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ,రమేష్ మాట్లాడుతూ విద్యార్థుల సాధనను మెరుగుపరిచే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని అత్యుత్తమ గ్రేడ్ ను సాధించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, పేరెంట్స్ పాల్గొన్నారు.

