Friday, April 17, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలకేసీఆర్ జన్మదినం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం

కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం

📰 Generate e-Paper Clip

నవగీతం,కొడిమ్యాల:

జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని కొడిమ్యాల మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 72.వ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.గ్రామపంచాయతీ ఆవరణలో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. కరీంనగర్‌కు చెందిన సన్‌రైజ్ హాస్పిటల్ వైద్య బృందం సుమారు 300 మంది రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసే స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు.ఆయన ఆరోగ్యంగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజా సేవలో భాగంగా వైద్య శిబిరం నిర్వహించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు పునుగొటి కృష్ణారావు, తిప్పాయపల్లె సర్పంచ్ లాగల రాజేశం, వివిధ గ్రామాల బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular