Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణరాజన్న సిరిసిల్లజాతీయ సైన్స్ దినోత్సవం నేపథ్యంలో విద్యార్థులకు పోటీలు

జాతీయ సైన్స్ దినోత్సవం నేపథ్యంలో విద్యార్థులకు పోటీలు

📰 Generate e-Paper Clip

నవగీతం, రుద్రంగి :

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ పురస్కరించుకొని విద్యార్థులకు పలు పోటీలను నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయులు తిరుపతి తెలిపారు. శనివారం పాఠశాలలో జాతీయ సైన్స్ డే సందర్భంగా నిర్వహించిన పోటీలలో ఉత్తమ పతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు. మానాల పాఠశాలల చెందిన విద్యార్థులు ఈ ప్రతిభ పోటీలలో పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి బహుమతి డి.లాస్యప్రియ, ద్వితీయ బహుమతి బి. సాహిత్, తృతీయ బహుమతి బి. అయాన్ అద్విత్ లకు గ్రామ ఉప సర్పంచ్ దాసరి అశోక్ ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ దాసరి అశోక్ మాట్లాడుతూ… మానాల పాఠశాల విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని. మండల, జిల్లా స్థాయిలో గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన అక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular