Saturday, May 30, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలబిజెపి అభ్యర్థుల గెలుపు పై సంబరాలు

బిజెపి అభ్యర్థుల గెలుపు పై సంబరాలు

📰 Generate e-Paper Clip

నవగీతం,మల్లాపూర్

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా బిజెపి పార్టీ అభ్యర్థులు గెలుపు పై మల్లాపూర్ మండల బిజెపి అధ్యక్షులు గోపిడి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా  మండల కేంద్రంలోని భరతమాత కుడలి వద్ద టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకొని స్వీట్లు పంపిణీ చేశారు. మెట్ పల్లి, కోరుట్ల ,రాయికల్ ఫలితాల్లో బిజెపి ముందంజలో ఉండడం ఎంతో సంతోషదాయకమని మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో బిజెపి శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం చేకూరిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు ఎర్ర లక్ష్మి, మండల ఉపాధ్యక్షుడు లవంగ శివ, మండల మహిళా అధ్యక్షురాలు సత్తమ్మ, గ్రామ శాఖ అధ్యక్షుడు ముష్కరి రాజు కుమార్, నాయకులు గంగారాజం, మనోజ్, జలపతి, శేఖర్, బిజెపి నాయకులు కార్యకర్తలు ఉన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular