Tuesday, April 14, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలబీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు

బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు

📰 Generate e-Paper Clip

నవగీతం,మెట్ పల్లి:

మెట్‌పల్లి పట్టణ 8వ వార్డుకు చెందిన దీవకొండ మానస–విష్ణు వర్ధన్ తమ వార్డు సభ్యులు,అనుచరులతో కలిపి సుమారు 40 మందితో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పార్టీలో చేరిన వారందరికీ పార్టీ కండువా కప్పి హృదయపూర్వకంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలే ప్రజలను ఆకర్షిస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు తీవ్రంగా నిరాశ చెందుతున్నారని, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మెట్‌పల్లి పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లగలదని స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించి, మెట్‌పల్లి పట్టణ అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని కార్యకర్తలు,నాయకులు, ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular