Thursday, April 16, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలశ్రీ దుబ్బరాజేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు

శ్రీ దుబ్బరాజేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు

📰 Generate e-Paper Clip

సమర్పించిన కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ గ్రామంలోని శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవానికి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు కలెక్టర్ దంపతులను ఆశీర్వదించి శాలువాతో ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, శానిటేషన్ చర్యలు నిరంతరం చేపట్టాలని, భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సౌకర్యం సమృద్ధిగా కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular