విడిసి ఆధ్వర్యంలో ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్ ప్రారంభం
నవగీతం, మల్లాపూర్:
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సహకారం అందించాలని ప్రధానోపాధ్యాయులు వేణు అన్నారు. బుధవారం మల్లాపూర్ మండలంలోని పాతదాంరాజ్ పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రూ.17 వేల విలువ గల ఫ్యూరీ ఫైడ్ వాటర్ ఫిల్టర్ ను వీడీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు దాతలు అన్నిరకాల సంపూర్ణ సహాయ సహకారాలు అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యార్థులకు శుద్ధమైన త్రాగు నీరు అందించేందుకు ముందుకు వచ్చిన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వీడీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులను ఉపాద్యాయ బృందం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రొండ్ల రాజేశ్వరి రాజారెడ్డి ,ఉప సర్పంచ్ ఇప్పపల్లి గణేష్, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ వనిత, కార్యదర్శి రమేష్ వార్డు సభ్యులు బోయిని జల హన్మాండ్లు, మానస ధర్మరాజ్, వినోద్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ విడిసి సభ్యులు హనుమత్ రెడ్డి సాకలి వినోద్ వద్దిరాజ్ రెడ్డి ఈ లింగం ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

