ప్రజావాణిలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి రైతులతో కలిసి వినతి..
నవగీతం, జగిత్యాల ప్రతినిధి
మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్ నుండి జీవన్ రెడ్డి రైతులతో కలిసి ర్యాలీగా కలెక్టరేట్ కు తరలివెళ్లారు. అనంతరం రైతులతో కలిసి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రజావాణి లో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మాజీమంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో సుమారు 50 వేల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగుచేస్తున్నారని తెలిపారు. వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. మొక్క జొన్న రైతులు వన్య ప్రాణుల బెడద, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని పంట సాగు చేస్తున్నారని, కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యంతో రైతులకు కనీస మద్దతు దర రూ.2400 దక్కడం లేదన్నారు. ఏటా ఈదురుగాలులు, వడగళ్ల వానతో మొక్కజొన్న రైతులు పంట నష్టపోతున్నారని, రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలులో లేకపోవడంతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వమే పరిహారం అందజేయాలన్నారు.మొక్క జొన్న రైతులు ఎకరానికి 30 వేలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్నారని వివరించారు. పంట చేతికి వచ్చిన కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జాప్యంతో రైతులకు కనీస మద్దతు ధర పొందలేకపోతున్నారని వెల్లడించారు.

ప్రతి క్వింటాల్ పై రైతు రూ.500 చొప్పున సుమారు 30 క్వింటాళ్లకు ఎకరానికి సుమారు 15000 నష్టపోతున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మార్కెఫేడ్ ఆద్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారనీ గుర్తు చేశారు.పంట సాగు చేసే సమయంలోనే పరిమితి లేకుండా రైతులకు భరోసా కల్పించేలా రైతు భరోసా పంట సాగు చేపట్టేందుకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని, కనీస మద్దతు ధర కల్పించడంతోపాటు కోతుల బెడద నివారించేందుకు చర్యలు చేపట్టాలని,గతంలో మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు నిర్వహించిన చోట ఉగాది పండుగ నుండి మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

