Friday, April 17, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలశాంతి భద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు

శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు

📰 Generate e-Paper Clip

జిల్లా కోర్టు, సబ్ కోర్టుల్లో బాంబ్ డిస్పోజల్ టీం, పోలీసు జగిలాలతో ప్రత్యేక తనిఖీలు

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా కోర్టు, సబ్ కోర్టు ప్రాంగణలలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయడం కోసం బాంబ్  డిస్పోజల్ టీం, పోలీసు జగిలాల తో  ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం జరిగింది. తనిఖీల సమయంలో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్ స్థలాలు, కోర్టుల  పరిసర ప్రాంతాలను ఒక్కొక్కటిగా పరిశీలించారు. అనుమానాస్పద వస్తువులు, ప్యాకేజీలు, సంచులు లేదా భద్రతకు ముప్పు  కలిగించే అంశాలఫై  ప్రత్యక తనికి నిర్వహించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తెలిపారు.ఈ తనిఖీల్లో, బాంబ్ డిస్పోజల్ టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular