నవగీతం, ఇబ్రహీంపట్నం:
కరీంనగర్ నగరంలో ఫిలిం భవనం వేదికగా తెలుగు వెలుగు జాతీయ ఉగాది సాంస్కృతిక ఉత్సవాలు 2026 అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి తెలుగు వెలుగు సాహితీ వేదిక తెలుగు ఇండియన్ కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు కాళోజి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంయుక్తంగా ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యాప్తంగా వివిధ రంగంలో విశేష సేవలు అందిస్తున్న ప్రముఖులకు పురస్కారాలు అందజేశారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన శ్రీపాద.లింబాద్రి ఉగాది జాతీయ నంది అవార్డు వరించింది ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత విశ్వ కళా విరాట్ డాక్టర్ శాంతి వంగల కృష్ణ ఆచార్యులు, ప్రముఖ హాస్య నటుడు నంద, సహజనటి గుంటుక రాధిక, జాతీయ యువజన అవార్డు గ్రహీత కిరణ్ కుమార్,తెలుగు వెలుగు సాహితి వేదిక జాతీయ చైర్మన్ పోలోజు రాజ్ కుమార్ చేతుల మీదుగా శ్రీపాద లింబాద్రి అందుకున్నారు.

