Tuesday, April 14, 2026
ads
Homeకరీంనగర్సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి.

సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి.

📰 Generate e-Paper Clip

ఆర్టిఐ రాష్ట్ర అధ్యక్షులు దొగ్గలి శ్రీధర్

నవగీతం, కరీంనగర్:

సమాజంలో అవినీతి అక్రమాలు జరిగితే వాటిని నిర్మూలించడానికి అవినీతిని అరికట్టడానికి అవినీతి చేసిన వారిని బహిరంగపరచడానికి సమాచార హక్కు చట్టాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దీనిని కొంతమంది ఉపయోగించుకొని బ్లాక్ మెయిల్ లు చేసుకుంటూ లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు ఇలాంటి వారిపై జిల్లా కలెక్టర్ జిల్లా పోలీస్ కమిషనర్ దృష్టి పెట్టాలని కోరుతున్నాం కొంతమంది కుల సంఘాల నాయకులు , విద్యార్థి సంఘం నాయకులమని చెప్పుకునేవారు విద్యాసంస్థలను టార్గెట్ చేసుకొని వారిని సమాచార హక్కు చట్టం రూపాన ఇబ్బందులకు గురిచేస్తూ లక్షలాది రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వాటిని అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సమాజంలో అవినీతి జరిగినప్పుడు వాటిని సమాచార హక్కు చట్టం రూపంలో సేకరించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి వారిపై చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేయాలి కానీ దీనిని అడ్డుపెట్టుకొని యాజమాన్యాలను బెదిరిస్తూ లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. ఇదే వ్యాపారంగా చేసుకుంటూ కొంతమంది జీవిస్తున్నారు ఇలాంటి వారిపై జిల్లా అధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నాం

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular