Tuesday, April 14, 2026
ads
Homeకరీంనగర్ఏప్రిల్ 14న కరీంనగర్‌లో అంబేద్కర్ జయంతి సభ

ఏప్రిల్ 14న కరీంనగర్‌లో అంబేద్కర్ జయంతి సభ

📰 Generate e-Paper Clip

నవగీతం, కరీంనగర్:

బహుజన్ సమాజ్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల ఏప్రిల్ 14న నిర్వహించ తలపెట్టిన బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సభ పోస్టర్‌ను రామడుగు మండల కేంద్రంలో ఆవిష్కరించారు.జ్యోతిరావు పూలే (సర్కస్ గ్రౌండ్), కరీంనగర్. ఏప్రిల్ 14 సాయంత్రం .మాతంగి అశోక్ అధ్యక్షతన జరుగుతుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అడ్వకేట్ నీషానీ రామచంద్రం (చీఫ్ జోనల్ ఇంచార్జ్ హాజరుకానున్నట్లు తెలిపారు.పోస్టర్ ఆవిష్కరణ అనంతరం కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ కల్లేపల్లి రాజేందర్ మాట్లాడుతూ..గతంలో కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ని మోసం చేసిందని, రాజ్యాంగ రచన సభకు వెళ్లకుండా అడ్డుకుందని, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తోందని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీని విస్మరించి కులమతాల మధ్య చిచ్చు పెడుతోందని విమర్శించారు.మాయావతి నాయకత్వంలో రాజ్యాంగ అమలు కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ బిఎస్పి అని, ప్రతి గ్రామం నుండి వందలాదిగా తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ నియోజకవర్గ ఇంచార్జ్ ఆరేపల్లి వినోద్, మహిళా నాయకురాలు బడుగు లక్ష్మి, వార్డ్ మెంబర్ కడపల శ్రీశైలం, కల్లేపల్లి ప్రభాకర్, బడుగు కిషన్, మెరుగు ప్రశాంత్, అక్కనపల్లి అభి, ఆరేపల్లి ప్రేమ్ సాగర్, బక్కయ్య, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular