Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఅంగన్వాడిలో ప్రత్యేక పోషణ ఆరోగ్య శిబిరం

అంగన్వాడిలో ప్రత్యేక పోషణ ఆరోగ్య శిబిరం

📰 Generate e-Paper Clip

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:

మల్లాపూర్ మండలం రత్నాపూర్  అంగన్వాడి కేంద్రంలో శనివారం గర్భిణీ స్త్రీలు పిల్లల కోసం ప్రత్యేక పోషణ ఆరోగ్య శిబిరం నిర్వహించారు. 8వ పోషణ పఖ్వాడా లో భాగంగా గర్భిణీ స్త్రీలకు మొదటి 1000 రోజల్లో పోషకాహారం యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి గర్భిణీ స్త్రీలు , పాలిచ్చే తల్లులు మరియు సంరక్షకులతో కమ్యూనిటీ సమవేశం నిర్వహించి పోషకాహారం యొక్క ప్రాముఖ్యతను తెలిపారు.ఈ కార్యక్రమంలో లో గ్రామ సర్పంచ్ గొండ రాజేంధర్,ఏ.ఎన్.ఎం టీ. భాగ్య,ఆశా కార్యకర్తలు బీ.విజయ, ఎస్.లావణ్య మరిము అంగన్వాడీ టీచర్ లు శరణ్య, శశికళ, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular