నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:
కొడిమ్యాల మండలం అప్పారావుపేట గ్రామ పరిధిలో బుధవారం ఐకెపి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. స్థానిక సర్పంచ్ బండ (వేల్పుల) వినీల నరసింహారెడ్డి కార్యక్రమానికి అధ్యక్షత వహించి, సెంటర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్వో నరేష్, ఏపిఎం మల్లేశం హాజరయ్యారు. అలాగే డీటీ, ఉపసర్పంచ్ రేకులపల్లి తిరుపతి రెడ్డి, వార్డు సభ్యుడు పొన్నం అజయ్ గౌడ్, పండుగ శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రైతులు, మహిళా సంఘాల నాయకులు, సీఏ మౌనికతో పాటు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఐకెపి సెంటర్ ప్రారంభంతో గ్రామంలోని మహిళా సంఘాలకు, రైతులకు మరింత మద్దతు లభిస్తుందని ప్రముఖులు అభిప్రాయపడ్డారు.

