Wednesday, April 29, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలరైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

📰 Generate e-Paper Clip

నిర్వాహకులు త్వరితగతిన కొనుగోళ్ళు పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల రూరల్ మండలం లోని చల్ గల్, తాటిపెల్లి గ్రామాల్లో  ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్  తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..రైతులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా,వేగంగా కొనుగోలు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం స్వీకరణ పరిస్థితిని ,తూకం విధానాన్ని ,17% తేమ శాతం నిర్వహణను మరియు కేంద్రల వద్ద వసతులను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే వరి ధాన్యంపై ప్రభుత్వ నిబందనల మేరకు తేమశాతం తప్పనిసరిగా పరిశీలించి, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోళ్ళు చేయాలని,కొనుగోలు చేసిన ధాన్యాన్ని వాహనాల ద్వారా తక్షణమే రైస్ మిల్లులకు తరలించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.క్లస్టర్ అధికారులకు కేటాయించిన కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన బరువు యంత్రాల నిర్వహణ, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్స్, త్రాగునీరు, షేడ్ నెట్ ల ఏర్పాటు, ధాన్యం కొనుగోళ్ళు వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అలాగే వాతావరణం మార్పుల దృష్ట్యా టార్ఫలిన్ కవర్ లు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular