Saturday, April 25, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలఅర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన కోరుట్ల బీజేపీ నాయకులు

అర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన కోరుట్ల బీజేపీ నాయకులు

📰 Generate e-Paper Clip

ఆత్మ బలిదానం చేసుకున్న శంకర్ గౌడ్ కుటుంబానికి 5 కోట్ల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి

నవగీతం, కోరుట్ల ప్రతినిధి:

కోరుట్ల పట్టణం లోని బస్టాండ్ సమీపంలో ఆర్టీసీ కార్మికులు తమ హక్కులు, వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, ఇతర సంక్షేమ అంశాల కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా సమ్మెను ఉద్దేశించి బిజెపి నాయకులు మాట్లాడుతూ.. జేఏసీ తలపెట్టిన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు మీ పక్షాన బిజెపి మీ వెన్నంటే ఉంటుందని హామీ ఇస్తున్నామని అన్నారు.ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం ఆత్మ బలిదానం చేసుకున్న శంకర్ గౌడ్ కుటుంబానికి 5 కోట్ల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయడానికి కోరుట్ల డిపో ఉద్యోగులందరూ కలిసి జేఏసీ గా ఏర్పడి సమ్మెలో పాల్గొనడం జరిగింది ఇందులో భాగంగా ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, యూనియన్ల పునరుద్ధరణ, పెండింగ్ పిఆర్సీలు.. అలాగే 32 డిమాండ్ల పైన ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆర్టీసీ గురించి పెట్టిన అంశాలను నెరవేర్చమని ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇట్టి సమ్మె నోటీస్ కు జేఏసీ నాయకులను ప్రభుత్వం చర్చలకు పిలవడం జరిగింది.అట్టి చర్చలు విఫలం కావడంతో సమ్మె చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆర్టీసీ జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లను పరిష్కరించవలసిందిగా కోరారు.సమ్మె మూడవ రోజుకు చేరింది ఇట్టి సమ్మెకు సంఘీభావం తెలిపినందుకు ఆర్టీసీ పక్షణ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి జగిత్యాల జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ వై. అనూప్ రావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మినారాయణ నిజామాబాద్ పార్లమెంట్ కన్వీనర్ గుంటుక సదశివ్, జిల్లా నాయకుడు సుదవేణి మహేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎర్ర రాజేందర్, మాజీ కౌన్సిలర్ పెండం గణేష్, సీనియర్ నాయకడు గిన్నెల శ్రీకాంత్, మ్యాకల గణేష్, ధమ్మా సంతోష్ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular