నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:
మల్లాపూర్ మండలంలోని రాఘవపేట గ్రామంలో గత కొన్ని రోజులుగా ఉత్సాహంగా సాగుతున్న రాఘవపేట ప్రీమియర్ లీగ్ (RPL) సీజన్ 3 క్రికెట్ పోటీలు ముగిశాయి. ఫైనల్ మ్యాచ్‌లో థండర్ బ్రదర్స్ జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి విజేతగా నిలవగా, ఎమ్మెస్ ధోని టీమ్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. యువత క్రీడల్లో రాణించడంతో పాటు గ్రామాభివృద్ధిలోనూ ముందుండాలని పిలుపునిచ్చారు. క్రీడలు ఐక్యతను పెంచుతాయని, ఇంతటి భారీ టోర్నీని విజయవంతం చేసిన గ్రామ పాలకవర్గానికి, యువతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రమశిక్షణతో ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


