Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఇంటర్ ఫలితాల్లో 'మాస్ట్రో' విజయదుందుభి

ఇంటర్ ఫలితాల్లో ‘మాస్ట్రో’ విజయదుందుభి

📰 Generate e-Paper Clip

స్టేట్ ఫస్ట్ ర్యాంకులతో ఘనవిజయం

నవగీతం,కోరుట్ల ప్రతినిధి:

విడుదలైన ఇంటర్మీడియట్ 2026 ఫలితాల్లో మాస్ట్రో విద్యాసంస్థ మరోసారి తన మేటి ప్రతిభను చాటుకుంది. అత్యున్నత ప్రమాణాలతో కూడిన శిక్షణ, క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన ఫలితంగా ఎం.పి.సి, బై.పి.సి మరియు సి.ఇ.సి విభాగాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది.

ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు: ఎం.పి.సి విభాగంలో మాస్ట్రో విద్యార్థినులు కళ్లు చెదిరే మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకును సొంతం చేసుకున్నారు.సూరినేని ఇందు :470/ 468,కొక్కుల లక్ష్య :470/468, బై.పి.సి లో ఉమ్మె హనీ:436/440 (రాష్ట్ర రెండో స్థానం).సి.ఇ.సి లో ముక్కెర అక్షయ:491/500 (జిల్లా మొదటి స్థానం).

ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు: రెండో సంవత్సరంలోనూ మాస్ట్రో విద్యార్థులు తమ విజయ పరంపరను కొనసాగించారు సి.ఇ.సి లో ఎంభేరి జాగృతి: 990/1000 మార్కులతో స్టేట్ ఫస్ట్ సాధించింది.బై.పి.సి లో ఉజ్మ : 994/1000 (స్టేట్ సెకండ్), ఎం.పి.సి లో సుంకరి శృతి: 992/1000, ఎం.పి.సి లో గరిట్యాల దైవకృప :992/1000, ఈ ఘన విజయంపై మాస్ట్రో విద్యాసంస్థ ప్రిన్సిపాల్ అధ్యాపక బృందం స్పందిస్తూ.. తమ విద్యార్థుల అంకితభావం, అనుభవజ్ఞులైన లెక్చరర్ల సరైన మార్గదర్శకత్వమే ఈ విజయానికి మూలమని పేర్కొన్నారు.”మా విద్యాసంస్థలో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించడం మరియు ఒత్తిడి లేని విద్యా విధానాన్ని అందించడం వల్లే నేడు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించగలిగాము. విజయం సాధించిన విద్యార్థులకు మరియు వారికి వెన్నంటి నిలిచిన తల్లిదండ్రులకు మా అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular