నవగీతం,కోరుట్ల ప్రతినిధి:
కోరుట్ల నియోజకవర్గ బిజెపి నాయకురాలు పూదరి అరుణను రెండోసారి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది.ఈ సందర్భంగా ఆమె నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ను మర్యాదపూర్వకంగా కలిసి, తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా పూదరి అరుణ స్పష్టం చేశారు.

