నవగీతం, జగిత్యాల ప్రతినిధి :
జిల్లా గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్తర తెలంగాణ స్థాయి భీష్మ క్రికెట్ ట్రోఫీ 2026 సీజన్ 2 ఆహ్వాన పత్రికను గురువారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు అందచేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు ప్రశాంత్ రావు, జుంబర్తి రాజ్ కుమార్, ఆరుముల్ల పవన్, బట్టు రాకేశ్, సముద్రాల తిరుపతి, కల్లెడ నరసింహ రాజు, అరుముళ్ళ వంశీ, తోకల సుధాకర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

