బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కొండగట్టు హనుమాన్ ఆలయంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.ఈ నేపథ్యంలో, ఆలయ పరిసర ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ బృందాల ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, ప్రధాన ప్రవేశ ద్వారాలు, మరియు భక్తులు ఎక్కువగా రాకపోకలు చేసే ప్రదేశాల్లో సోదాలు నిర్వహించి అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టారు.భక్తులు ప్రశాంతంగా స్వామి వారి దర్శనం చేసుకునేలా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా, ప్రజలు కూడా పోలీసులకు సహకరించి, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించిన వెంటనే సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.


