నవగీతం, కరీంనగర్:
కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన మెట్ పల్లి మండలంలోని వెల్లుల్ల గ్రామానికి చెందిన శ్రీరామ్ అంజయ్య (75), పెద్దపల్లి జిల్లా కు చెందిన మంథని నివాసుడైన బూర్గు రాజయ్య (80), కరీంనగర్ దేశరాజు పల్లి గ్రామస్తుడైన ఆవుదుర్తి సతీష్ (45) లు వారి గ్రామాల్లో అనాధలుగా ఉన్నారని తిండి లేక ఇబ్బంది పడుతూ ఆరోగ్యం క్షీణించినదని కరీంనగర్ రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారి ముగ్గురిని కరీంనగర్ కు రప్పించి వారిని ఆసుపత్రులలో చూపించి వారి బాగోగులు చూసుకోవడం కొరకు రూరల్ పిఎస్ పరిధిలో ఉన్న వీరబ్రహ్మేంద్రఅనాధ వృద్ధుల ఆశ్రమం నిర్వాహకులు వీరమాధవ్ కి తెలియజేసి వారి ముగ్గురిని సి ఐ నిరంజన్ రెడ్డి ఎస్సైలు నరేష్ లక్ష్మారెడ్డి, పోలీసు సిబ్బంది శాలువాలతో సత్కరించివారికి తక్షణ మందులు మరియు పండ్లు ఇచ్చి పోలీసు వాహనంలో తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో చేర్పించారు.ఈ కార్యక్రమం లో కరీంనగర్ జిల్లా రెడ్ క్రాస్ సెక్రటరీ ఉట్కూరి రాధాకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

