రెపరెపలాడిన కాషాయ జెండా
నవగీతం,కోరుట్ల ప్రతినిధి :
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కోరుట్ల పట్టణంలో పార్టీ శ్రేణులు సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద మరియు ముఖ్య కూడళ్లలో బిజెపి పట్టణ కౌన్సిలర్లు మరియు సీనియర్ నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్లు మాట్లాడుతూ, అతి తక్కువ కాలంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బిజెపి అవతరించిందని కొనియాడారు.ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో మెలిగి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనుష్ రావు మరియు రాష్ట్ర ఓబిసి మోర్చా ఉపాధ్యక్షులు రుద్ర శ్రీనివాస్ జక్కుల ప్రవీణ్ పట్టణ అధ్యక్షులు కస్తూరి లక్ష్మీ నారాయణ భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ చేయగా
ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎర్ర రాజేందర్ చెట్లపెల్లి సాగర్ కౌన్సిలర్ తిరుమల వాసు గుగులోతు శ్రీకాంత్ మాజీ కౌన్సిలర్ మాడవి నరేష్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.


