Thursday, April 16, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఖుతుబోద్దీన్ పాషా, అజీమ్ కుటుంబాలకు జిల్లా ఐజేయు అధ్యకుడి పరామర్శ

ఖుతుబోద్దీన్ పాషా, అజీమ్ కుటుంబాలకు జిల్లా ఐజేయు అధ్యకుడి పరామర్శ

📰 Generate e-Paper Clip

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాషా, మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా ప్రధాన కార్యదర్శి మహ్మద్ అజీమ్ ల తల్లి మృతి పట్ల టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు చీటీ శ్రీనివాసరావు సంతాపం వ్యక్తం చేశారు. గత ఐదు రోజుల క్రితం వారి తల్లి మరణించగా, బుధవారం ఐజేయు అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు జిల్లా కార్యవర్గ సభ్యులు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఐజేయు జనరల్ సెక్రెటరీ సంపూర్ణ చారి, క్యాషియర్ వేణు గోపాల్ , మెట్ పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బూరం సంజీవ్, జిల్లా కార్యవర్గ సభ్యులు సాజిద్ పాషా, బాసెట్టి హరీష్, మహేందర్, సభ్యులు గణేష్, 20 వార్డు కౌన్సిలర్ మసూల ప్రవీణ్, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మెట్ పల్లి ప్రెస్ క్లబ్ సభ్యుల పరామర్శ

కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాషా, మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా ప్రధాన కార్యదర్శి మహ్మద్ అజీమ్ ల తల్లి మృతి పట్ల టి యు డబ్ల్యూ జే (ఐజేయు) మెట్ పల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. గత ఐదు రోజుల క్రితం వారి తల్లి మరణించగా, బుధవారం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బూరం సంజీవ్, ప్రెస్ క్లబ్ సభ్యులు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు జంగం విజయ్, జిల్లా కార్యవర్గ సభ్యులు సాజిద్ పాషా, సంయుక్త కార్యదర్శి పింజరి శివకుమార్, కార్యవర్గ సభ్యులు మహేందర్ ,బొల్లం రాజు, కుర్ర రాజేందర్, హైమద్, రఫీ హులా, సభ్యులు అమ్ముల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular