నవగీతం,కరీంనగర్ ప్రతినిధి:
శాతవాహన విశ్వవిద్యాలయం అర్ధశాస్త్రం విభాగంకు చెందిన పరిశోధకుడు వి. వెంకటేష్ డాక్టరేట్ పొందారు.ఆయన అర్థశాస్త్ర విభాగపు అధిపతి డాక్టర్. కె..శ్రీవాణి పర్యవేక్షణలో “ఇంపాక్ట్ అఫ్ రైతుబంధు ఆన్ ఫార్మర్స్ -ఏ కేస్ స్టడీ ఇన్ ఖమ్మం డిస్ట్రిక్ట్” అనే అంశంపై పరిశోధన చేసి సమర్పించిన సిద్ధాంత గ్రంధానికి డాక్టరేట్ ప్రధానం చేసినట్టు బుధవారం రోజున విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్. సురేష్ కుమార్ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా వెంకటేష్ కు విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ యు. ఉమేష్ కుమార్, రిజిస్టార్ ప్రొఫెసర్. పి. సతీష్ కుమార్, విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. కె. పద్మావతి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మహమ్మద్ అబ్రర్, డాక్టర్ జాఫర్ జరీ , డీన్ ఫ్యాకల్టీ సోషల్ సైన్సెస్ ప్రొఫెసర్. ఎం. వరప్రసాద్, డాక్టర్ సరసిజా, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు అభినందనలు తెలియజేసినారు.

