Friday, April 17, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

చిట్టాపూర్ లో నివాళులర్పిస్తున్న నాయకులు

నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:

భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం లో  వారి చిత్రపటానికి పూల మాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంపతి శంకరమ్మ-ఆశలు, ఉప సర్పంచ్ బాల్సని ప్రణయ్ గౌడ్, వార్డు సభ్యులు కొండబత్తిని లావణ్య,మిరియాల గంగూభాయ్, మట్ట రాములు, పబ్బతి జ్యోతి, ఉప్పులూటి లక్ష్మీ నారాయణ, కార్యదర్శి రుత్త అశోక్, కరోబర్ సత్యనారాయణ, ఫీల్డ్ అసిస్టెంట్ పెసరి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

సిరిపూర్ లో జగ్జీవన్ రామ్ జయంతి

భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా సిరిపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో  వారి చిత్రపటానికి పూల మాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెంటా సౌజన్య,శ్రీనివాస్ మాజీ సర్పంచులు నల్ల బాపురెడ్డి, సోమ లింగారెడ్డి వార్డు సభ్యులు ఏనుగు మాధవరెడ్డి, ఇప్ప గంగాధర్ కార్యదర్శి రవీందర్ , కరోబర్ రమేష్, ఫీల్డ్ అసిస్టెంట్  మమత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular