Monday, April 27, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలతిప్పాయపల్లిలో ఐకేపీ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

తిప్పాయపల్లిలో ఐకేపీ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

📰 Generate e-Paper Clip

నవగీతం, కొడిమ్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిప్పాయపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మల్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొండూరి రాజేష్, తిప్పాయపల్లి సర్పంచ్ ల్యాగలా రాజేశం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పాలకవర్గ సభ్యులతో కలిసి వారు రిబ్బన్ కట్ చేసి ఐకేపీ సెంటర్‌ను ప్రారంభించారు. గ్రామ మహిళా సంఘాల అభివృద్ధికి, స్వయం ఉపాధి అవకాశాల పెంపుకు ఈ కేంద్రం కీలకంగా ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గ్రామీణ మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఇలాంటి కేంద్రాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.అలాగే ప్రభుత్వ పథకాలను గ్రామస్థులకు చేరవేసే వేదికగా ఐకేపీ సెంటర్ పనిచేస్తుందని వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచులు, మాజీ వార్డ్ సభ్యులు, రైతులు దారం మల్లారెడ్డి, బిళ్ల మల్లారెడ్డి, గట్ల మల్లారెడ్డి, గ్రామ ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు, రైతులు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular