Tuesday, April 28, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలధాన్యం కొనుగోళ్లలో జాప్యం - చొప్పదండి లో బీఆర్ఎస్ నిరసన

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం – చొప్పదండి లో బీఆర్ఎస్ నిరసన

📰 Generate e-Paper Clip

నవగీతం, చొప్పదండి ప్రతినిధి:

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా.(తెలంగాణ చౌరస్తా) వద్ద మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డు పై బైఠాయించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ— పాత పద్ధతే బాగుండే కెసిఆర్ ఉన్నప్పుడు రైతులకు ఏ ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేశారు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించకుండా దాదాపు 25 రోజులు గడిచిపోయాయని విమర్శించారు. నూతనంగా ప్రవేశపెట్టిన జీపీఎస్ విధానం, ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మిల్లర్లను అరకొరగా కేటాయించడం వల్ల కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు.నామమాత్రపు ఏర్పాట్లు చేసి కొబ్బరికాయలు కొట్టడం కాదు…రైతుల పంటను వెంటనే కొనుగోలు చేయాలి” అని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, కొనుగోళ్ల నిర్వహణలో స్పష్టత లేకపోవడాన్ని ఎద్దేవ చేశారు.రైతులకు సమయానికి నీరు, ఎరువులు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఎరువులు కొనుగోలు చేస్తే ఇతర మందులు కూడా తీసుకోవాలనే విధానం అమలు చేస్తున్నారని విమర్శించారు. వెంటనే ఆ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మూడు సార్లు రైతు బంధు చెల్లింపులు జరగలేదని అన్నారు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.నిరసన నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకుని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌తో పాటు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular