విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసిన సోషల్ వర్కర్ లతీఫ్
నవగీతం,వైరా ప్రతినిధి
తెలంగాణలో బుధవారం రోజున ప్రకటించిన పది ఫలితాలలో వైరా మండలం జడ్పీఎస్ఎస్ సిరిపురం (కేజీ)పాఠశాల విద్యార్థులు మొదటి స్థానంలో ఖమ్మంపాటి ఆదిత్య 553 స్కూల్ ఫస్ట్ మార్కులతో అగ్రస్థానంలో ఉండగా, రెండవ స్థానంలో కమ్మం పాటి యశ్వంత్486, మూడవ స్థానంలో బొడ్డు సాయి 475, మార్కులతో ఉత్తీర్ణత సాధించినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేసిన సామాజిక కార్యకర్త లతీఫ్ బాయ్ పదవ తరగతి విద్యార్థులను పరీక్షల సమయంలో ఉచితంగా ఎటువంటి చార్జీలు ఆశించకుండా సమయానికి పరీక్షలకు తీసుకువెళ్లి పరీక్ష రాయించుకొని తీసుకొని వచ్చారు.ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త లతీఫ్ 500 పైగా మార్కులు సాధించడం మిగతా విద్యార్థులు వందకు వంద శాతం పైగా మార్కులు సాధించడం పట్లా హర్షం వ్యక్తం చేసి, విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

