Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఅక్రమంగా రవాణా చేస్తున్న పిడిఎస్ బియ్యం  పట్టివేత

అక్రమంగా రవాణా చేస్తున్న పిడిఎస్ బియ్యం  పట్టివేత

📰 Generate e-Paper Clip

3 క్వింటాళ్లు స్వాధీనం

నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:

కొడిమ్యాల మండల కేంద్రంలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా ఘటన వెలుగులోకి వచ్చింది.,స్థానిక బస్టాండ్ ముందు అంబేద్కర్ విగ్రహం సమీపంలో రోడ్డు ప్రక్కన పిడిఎస్ బియ్యము ప్రజల నుండి అక్రమంగా కొనుగోలు చేసిన సుమారు మూడు క్వింటాళ్ల బియ్యం. తరలిస్తున్న బియ్యాన్ని రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు.వివరాల ప్రకారం ఓ వ్యక్తి గ్రామంలో సుమారు 3. క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి అక్రమంగా తరలిస్తున్న సమయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) రాజారాం గమనించి అడ్డుకున్నారు.అనంతరం గ్రామస్తుల సమక్షంలో బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలిపారు.సీజ్ చేసిన బియ్యాన్ని కొడిమ్యాల రేషన్ షాప్ నంబర్-2709001. వద్ద భద్రపరిచినట్లు ఆర్‌ఐ రాజారాం వెల్లడించారు. ఈ సందర్భంగా జీపీఓ సాజిద్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు. రెవెన్యూ అధికారులు రేషన్ రవాణాపై మరింత విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular