Saturday, April 18, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలపిల్లల భవిష్యత్తు కోసం- బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం

పిల్లల భవిష్యత్తు కోసం- బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:

కొడిమ్యాల మండలం అప్పారావుపేట గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సూపర్వైజర్ సుధారాణి మాట్లాడుతూ, 18 సంవత్సరాలు నిండని బాలికకు, 21 సంవత్సరాలు నిండని బాలుడికి వివాహం చేయడం చట్టప్రకారం నేరమని తెలిపారు.అలాంటి వివాహాలు నిర్వహించిన వారికి చట్టం ప్రకారం రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధించబడుతుందని వివరించారు.సఖి కేంద్రం కౌన్సిలర్ గౌతమి మాట్లాడుతూ, బాల్య వివాహాల వల్ల భవిష్యత్తులో కలిగే నష్టాలు, బాల్య వివాహ నిరోధక చట్టం-2006, సంబంధిత న్యాయ పరిరక్షణ అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన టోల్ ఫ్రీ నంబర్లు1098, 181,1930,14567,100 గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు సూపర్వైజర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular