నవగీతం, జగిత్యాల ప్రతినిధి
బుగ్గారం మండలం లోని యస్వంతరావుపేట్ గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ కార్మికురాలు దూడ లచ్చవ్వ గత కొద్ది రోజుల క్రితం కుక్క కాటుకు గురి అవ్వగా విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల సుభాష్ బాధితురాలిని పరామర్శించి వారికి రూ. 5000/- ఆర్థిక సహాయం అందించారు.వీరి పరిస్థితి దృష్ట్యా సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లి ఇందిరమ్మ ఇల్లు మంజూరికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.అనంతరం గోపులాపూర్ గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం మరణించిన వడ్డేపల్లి రవీందర్ మరియు న్యతరి లింగన్న కుటుంభాలను కలిసి పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.వారి వెంట గ్రామ సర్పంచ్ బీర్పూరి తిరుపతి ,గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు మరిపెల్లి రవీందర్ రెడ్డి,గైని శ్రీను,రెంటం శ్రీధర్,బండారి మహేష్ తదితరులు ఉన్నారు.

