Friday, April 17, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమల్లాపూర్ లో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి

మల్లాపూర్ లో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:

భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మల్లాపూర్ మండలం మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూల మాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ..జాగ్జీవన్ రామ్ స్వతంత్రనంతరం స్వయంపాలనలో దేశ ప్రగతిలో పాలు పంచుకున్న గొప్ప వ్యక్తి అని దళిత,బహుజన వర్గాలకు ఆర్థిక, రాజకీయాల్లో సామాజిక న్యాయం దక్కినప్పుడే బాబు జాగ్జీవన్ రామ్ కు నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గడ్డం సోమ రెడ్డి, వార్డు సభ్యులు ముష్కరి రమేష్, కార్యదర్శి గూరుడు శ్రీనివాస్, కొంపెల్లి రాకేష్, ఎనుగంటి నరేష్, కదుర్క రాజేందర్, అరికుప్పల రాజం, ఎం.డి షబ్బీర్, భుక్యా శేఖర్, ముత్యాల గంగ రాజం,అల్లె లత -చంద్రయ్య, ఏనుగు లక్ష్మి, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి,మొరపు గంగ రాజం, శనిగారపు నరేష్, ఎం.ఆర్.పీ.ఎస్ రాష్ట్ర కార్యదర్శి మాట్ల బుచ్చయ్య, పెద్దిరెడ్డి లక్ష్మణ్ పలువురు నాయకులు,దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు.

ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా నివాళులు

స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్త మరియు సమానత్వ ఉద్యమానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచిన గొప్ప నాయకుడు, భారత మాజీ ఉపప్రధానమంత్రి బాబూ జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకొని మల్లాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గుండం పల్లి కార్యదర్శి నారాయణ రెడ్డి, రత్నాపూర్ కార్యదర్శి శ్రీధర్, జూనియర్ సహాయకులు ప్రశాంత్, కంప్యూటర్ ఆపరేటర్ విజయ్, ఆఫీస్ సబ్ఆర్డినేట్ నాగరాజు, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి, నాయకులు పెద్దిరెడ్డి లక్ష్మణ్, ఉయ్యాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular