Thursday, April 16, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలరాష్ట్రస్థాయి ప్రతిభవంతురాలు గుడిసె హాసినికి ఘన సన్మానం

రాష్ట్రస్థాయి ప్రతిభవంతురాలు గుడిసె హాసినికి ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

నవగీతం,కోరుట్ల ప్రతినిధి :

ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించి అఖండ విజయాన్ని అందుకున్న విద్యార్థిని గుడిసె హాసినిని కోరుట్లలోని 27వ వార్డు కౌన్సిలర్ ఇందూరి తిరుమలవాసు, ఆర్యవైశ్య సంఘం మరియు వాసవి క్లబ్ నాయకులు ఘనంగా సత్కరించారు. హాసిని నివాసానికి స్వయంగా వెళ్లిన వారు, ఆమెకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కష్టపడి చదివి రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించడం ద్వారా హాసిని తన తల్లిదండ్రులకు మాత్రమే కాకుండా మన ప్రాంతానికి కూడా గర్వకారణంగా నిలిచిందని కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, వాసవి క్లబ్ నాయకులు  పలువురు ప్రముఖులు పాల్గొని విద్యార్థినిని ప్రోత్సహించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular