రాయికల్ తహసీల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం తహసిల్దార్ కార్యాలయంను జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్ లత తనిఖీ చేశారు భూ భారతికి సంబంధించిన పెండింగ్ అంశాలు, ఓటరు జాబితా సవరణ మరియు సాధాబైనామ కు సంబంధించిన అంశాలపై చర్చించారు.ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్ లత మాట్లాడుతూ.. నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యలపై ప్రతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.మరియు మీసేవ సర్టిఫికెట్లను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సర్టిఫికెట్ల ప్రజలకు అందించవలసిందిగా అధికారులకు ఆదేశించారు. జనగణన-2027 మొదటి విడతలో భాగంగా ఇండ్ల గణన విధులు అధికారులు, సిబ్బంది సమన్వయంతో సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. జనగణనకు ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లను నియమించడం జరుగుతుందని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా మొదటి విడత ఇండ్ల గణన ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించాలని చెప్పారు. నివేదికలను సమయానికి సమర్పించాలన్నారు.ఈ సమావేశంలో రాయికల్ తహసీల్దార్ నాగార్జున, రెవెన్యూ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.

