Thursday, April 16, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలహిందువుల భవిష్యత్తు తరాల రక్షణకోసమే గిరిప్రదక్షిణ

హిందువుల భవిష్యత్తు తరాల రక్షణకోసమే గిరిప్రదక్షిణ

📰 Generate e-Paper Clip

ఘనంగా 39,వ కొండగట్టు గిరిప్రదక్షిణ

హిందువులు కలిసి ఒకటిగా నడుస్తున్నారు: శ్రీ సురేష్ ఆత్మారాం మహారాజ్ జీ

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కొండగట్టులో ప్రతీ పౌర్ణమి రోజున నిర్వహించే 39వ గిరిప్రదక్షిణ కార్యక్రమం గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రతీ పౌర్ణమి రోజున గిరిప్రదక్షిణ చేయాలనే సంకల్పంతో 2023 ఫిబ్రవరి 5న మాఘ పౌర్ణమి రోజున ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక గిరిప్రదక్షిణ పాదయాత్ర నిరాటకంగా కొనసాగుతోంది. గురువారం పౌర్ణమి, శ్రీహనుమాన్ చిన్న జయంతి కావడంతో మాలధారణ శ్రీహనుమాన్ దీక్ష స్వాములు, భక్తులతో కొండగట్టు కిక్కిరిసి పోయింది. ఉ సందర్భంగా నిర్వహించిన 39,వ గిరిప్రదక్షిణను శ్రీశ్రీశ్రీ సురేష్ ఆత్మరామ్ మహారాజ్ ఉదయం 5.30 గం, ప్రారంబించారు. ఈ సందర్బంగా మహారాజ్ మాట్లాడుతూ ఉదయం నాలుగు గంటలకే భక్తులు గిరిప్రదక్షిణ చేస్తున్నారని, హిందువులు వారి జాగ్రత్త భవిష్యత్తు తరాల రక్షణకోసమే కలిసి ఒకటిగా నడుస్తున్నారని, దీనితో సనాతన ధర్మానికి, దేశానికి మేలు, భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందని, హిందువుల కులాలకు, రాజకీయాలకు ఆతీతంగా ఐక్యత తో ధర్మ పరిరక్షణలో భాగస్వాములు కావాలని అన్నారు. చిరంజీవి, అనంతశక్తిశాలి అయిన శ్రీఆంజనేయ స్వామి కృప భక్తులపై ఎల్లప్పుడూ ఉండి, వారిలో ఆవహించి దేశరక్షణతో పాటు సనాతన ధర్మ పరిరక్షణ గావించాలని కోరారు.

గిరిప్రదక్షిణ మధ్యలో జగిత్యాల జిల్లా విద్యాశాఖాధికారికి రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ జగిత్యాల జిల్లా శాఖా అధ్యక్షులు వేల్పుల స్వామియాదవ్ శ్రీ ఆంజనేయ స్వామి లడ్డూ ప్రసాదం అందజేసి శ్రీహనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గిరిప్రదక్షిణ, పాదయాత్రల వలన ఆధ్యాత్మిక భావన పెరగడంతో పాటు, స్వామివారి అనుగ్రహంతో సకల సత్ సంకల్పాలు నెరవేరుతాయని, ఆరోగ్యపరంగా కూడా ఎంతో శ్రేయోదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.వో చంద్రశేఖర్ రెడ్డి, రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్, టీజీయూఎస్ జిల్లా అధ్యక్షులు నూనావత్ రాజు, రామిడి సురేందర్, గుండేటి రాకేష్ వేలాది మంది భక్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular