Sunday, April 19, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలహిందూ సమ్మేళన కమిటీ ఏర్పాటు

హిందూ సమ్మేళన కమిటీ ఏర్పాటు

📰 Generate e-Paper Clip

నవగీతం కొడిమ్యాల


కొడిమ్యాల పట్టణంలో వివిధ కుల సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా బాధ్యులు సాయి మధుకర్ హాజరయ్యారు.హిందూ సమాజంలో ఆత్మవిశ్వాసం, ఐకమత్యం పెంపొందించడం, మత మార్పిడిని నిరోధించడం, దేవాలయ వ్యవస్థను బలోపేతం చేయడం, సామాజిక సామరస్యాన్ని నెలకొల్పడం, కుటుంబ వ్యవస్థను దృఢపరచడం, స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించడం, జాతీయ భావాలను పెంపొందించడం వంటి లక్ష్యాలతో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.అలాగే హిందూ సమాజం పట్ల గౌరవ భావం, స్వధర్మంపై అంకితభావం, సేవా స్పూర్తిని పెంపొందించడం కమిటీ ముఖ్య ఉద్దేశ్యాలుగా పేర్కొన్నారు. హిందూ సమ్మేళనం కమిటీ అధ్యక్షుడిగా రాచకొండ చంద్రమోహన్, గౌరవ అధ్యక్షులుగా గడ్డం జీవన్ రెడ్డి, కంచర్ల సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా పిట్టల శ్రీనివాస్, చిట్టిపాక రమేష్, అంకం పద్మ నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కాయిత రమేష్, సహ కార్యదర్శులుగా కంచర్ల రాజమౌళి, జక్కుల మల్లేశం బాధ్యతలు స్వీకరించారు. కోశాధికారిగా అయిట్ల రమేష్, సహ కోశాధికారులుగా సామ భాస్కర్ రెడ్డి నియమితులయ్యారు.సాంస్కృతిక ప్రముఖుడిగా బద్దెనపల్లి నారాయణ వ్యవహరించనున్నారు.ఈ కమిటీ హిందూ సమాజ ఐక్యత, సామరస్యత, స్వధర్మ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular