Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఈత వనం ప్రమాద బాధితులకు టీఆర్‌పీ అండ.. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే

ఈత వనం ప్రమాద బాధితులకు టీఆర్‌పీ అండ.. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే

📰 Generate e-Paper Clip

నవగీతం, కొడిమ్యాల ప్రతినిధి:

కొడిమ్యాల మండలం కోనాపూర్ గ్రామంలో గురువారం జరిగిన ఈత వనం ప్రమాద ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు స్పందించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే పార్టీ తరఫున గౌడన్నలకు ధైర్యం చెప్పి ఓదార్చడం జరిగింది.అలాగే ఈ ఘటనలో నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యేకు ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంటనే స్పందించి బాధితులకు సహాయం అందించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రేపె బోర్ వేయించి మోటార్ బిగించేలా చర్యలు చేపడతామని ఫోన్ ద్వారా మాట ఇచ్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఆర్‌పీ చొప్పదండి నియోజకవర్గ ఇంచార్జి కొప్పుల వెంకటేష్, కొడిమ్యాల మండల అధ్యక్షుడు వరుణ్‌తో పాటు స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular