Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణకరీంనగర్దళిత క్రైస్తవులకు అన్యాయం జరిగితే సహించే ప్రసక్తే లేదు

దళిత క్రైస్తవులకు అన్యాయం జరిగితే సహించే ప్రసక్తే లేదు

📰 Generate e-Paper Clip

పద్మశ్రీ డాక్టర్ మంద కృష్ణ మాదిగ

నవగీతం, కరీంనగర్:

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఇందిరా గార్డెన్ లో మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పాస్టర్స్ ఆధ్వర్యంలో దళిత క్రైస్తవుల హక్కుల అవగాహనా సదస్సు సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ డాక్టర్ మంద కృష్ణ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దళిత క్రైస్తవులు అందరూ కూడ తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పాడిందని, హక్కుల పోరాట సమయం ఆసన్నమైందని అన్నారు. ప్రభుత్వం దళిత క్రైస్తవులను విడదీశి పాలించలాని కుట్రలు చేస్తున్నారని, ఎవరు ఆందోళన చెందవద్దని, మన హక్కుల కోసం పోరాడి సాధించుకుందామని, క్రైస్తవ నాయకులు, సంఘాల నాయకులు, దైవసేవకులు, దళిత క్రైస్తవులు ఐక్యతతో పోరాడి కుట్రలు చేస్తున్న ప్రభుత్వం దిగివచ్చి తాము హక్కులను తిరిగి అందించే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమా ముఖ్య అతిథి పద్మశ్రీ డాక్టర్ మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ఈ దేశంలో ఎవరు ఎదుర్కొన్నంత వివక్షత, అవమానాలను దళిత క్రైస్తవులు ఎదుర్కొంటున్నారని, దేశంలోని దళిత క్రైస్తవులకు ఏలాంటి దిక్కులేని పరిస్థితి ఏర్పడిందని, దళిత క్రైస్తవుల పక్షాన న్యాయం ధర్మం ఉంది కాబట్టే మాలాంటి వారు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. 1950లో వచ్చిన ఆర్డర్ రాజ్యాంగ విరుద్దామని, మత స్వేచ్ఛను హరించే ఎవరికీ లేదాని, దళిత క్రైస్తవులు తమ హక్కులపై అవగాహనా కలిగి ఉండాలని అన్నారు. ఈ హక్కులకై క్రైస్తవ నాయకులు ముందుండి పోరాటం చేయాలని, మీ పోరాటానికి తమ సహకారం ఉంటుందని తెలిపారు. ఈ దేశంలో ఎక్కడ దళితులకు, దళిత క్రైస్తవులకు అన్యాయం జరిగిన నేను, ఏమార్పిస్ సహించడని, న్యాయం జరిగే పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. 1950 ఆర్డర్ సవరణ లేదా రద్దు చేయాలని, ఈ దేశంలో కుల వ్యవస్థను రద్దు చేసి సమన్యాయం చేయాలని, కేవలం దళిత క్రైస్తవుల హక్కులను హరీస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదాని, ఆర్డర్ సవరణ లేదా రద్దు చేసి దళిత క్రైస్తవులకు న్యాయం జరిగే తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. అనంతరం జగిత్యాల పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బడుగు లాజరస్ పాడిన ‘రండిరా కదలండిరా’ పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ డెమోక్రటిక్ నాయకులు, అల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ జిల్లాల అధ్యక్షులు, నాయకులు, నియోజకవర్గ, మండల పాస్టర్స్ అసోసియేషన్ నాయకులు, దైవసేవకులు, దళిత క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular