దాడిని ఖండిస్తున్న కొడిమ్యాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు
నవగీతం, కొడిమ్యాల ప్రతినిధి:
కొడిమ్యాల మండల కేంద్రంలో శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి సరికాదని అందులోనూ కరీంనగర్ శాసనసభ్యులైనా గంగుల కమలాకర్ ఆఫీసుపై దాడి చేయడం, హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేయడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లేనని అన్నారు..ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..రాజకీయాలలో విమర్శకు ప్రతి విమర్శ చేయాలి తప్ప ఇలా దాడులు చేయడం సరికాదు అన్నారు..ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ లో బీహార్ మాదిరి రౌడీయిజంచేసి అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలని అన్నారు..ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు, భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ పోలు రాజేందర్, పట్టణ అధ్యక్షులు కొత్తూరి స్వామి, మాజీ ఎంపీటీసీ లు శ్రీనివాస్, గడ్డం చంద్రమోహన్ రెడ్డి,రైతుబంధు అధ్యక్షులు మాజీ అంకం రాజేశం, మాజీ సర్పంచ్ మల్యాల మహిపాల్,యువజన అధ్యక్షులు గడ్డం లక్ష్మారెడ్డి,నాయకులు ఆకునూరి మల్లయ్య,రాచకొండ చంద్రమోహన్, అఖిల్,మోహన్ తదితరులు పాల్గొన్నారు.

