నవగీతం, వైరా ప్రతినిధి:
వైరా మండలం పాలడుగు స్థానిక హై స్కూల్ లో దివ్యాంగులకు ఎస్ ఆర్ డి ఎస్ ఎనేబుల్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు వ్యాపార నైపుణ్య శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ప్రధానోత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎస్ ఆర్ డి ఎస్ డైరెక్టర్ గడ్డం రాంబాబు అధ్యక్షత వహించి మాట్లాడుతూ వైరా మండలంలో దివ్యాంగులకు శిక్షణ ఇచ్చి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డైరెక్టర్ చంద్రశేఖర్ హాజరై మాట్లాడుతూ… తిరుమలాయపాలెం మండలంలో పది రోజులు దివ్యాంగులకు వ్యాపార నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడం జరిగింది తదనంతరం వీరందరికీ రుణాల కొరకు వారి యొక్క అప్లికేషన్లను బ్యాంకులకు సిఫారస్ చేయడం జరుగుతుంది వారి యొక్క అర్హతలను బట్టి అవకాశం ఉన్నవారికి రుణాలు కూడా లభిస్తాయని తెలిపారు శిక్షణలో పాల్గొన్న దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలిపారు.ప్రత్యేక అతిథి పాలడుగు గ్రామ సర్పంచ్ నరసింహారావు పాల్గొని మాట్లాడుతూ… గ్రామంలో ని దివ్యాంగులందరూ ఆర్థికంగా బలోపేతం అవ్వాలని అందుకు మా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు నేను ప్రత్యేకంగా దివ్యాంగులకు వారి సమస్యలు పరిష్కారానికి ప్రథమ స్థానాన్ని ఇస్తామన్నారు దివ్యాంగులు ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి మా వంతు కృషి మేము చేస్తాము అన్నారు.అదేవిధంగా ఈ కార్యక్రమంలో పర్పుల్ డిఎన్ఏ సొసైటీ ఇంచార్జ్ పెనుగొండ ఉపేందర్ పాల్గొని మాట్లాడుతూ… దివ్యాంగులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి వ్యాపార అభివృద్ధి కోసం మా సంస్థ నుండి సహకారం ఇస్తున్నాము రాబోయే రోజుల్లో వైరా మండలంలోని దివ్యాంగులకు మా సంస్థ నుండి వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవడానికి సహకారాన్ని అందిస్తామన్నారుఈ కార్యక్రమంలో ఎస్ బి ఐ ఆర్ సి టి ఫ్యాకల్టీ షేక్ హైద్బాపాషా ఎస్ ఆర్ డి ఎస్ ప్రతినిధి ప్రతాప్ , ఎనేబుల్ కమిటీ ప్రతినిధులు దివ్యాంగులు పాల్గొన్నారు.


