నవగీతం,రాయికల్ ప్రతినిధి:
రాయికల్ పట్టణంలోని కేశవ నగర్ లో విశ్వబ్రాహ్మణ మనుమయ భక్త బృందం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి ఆదివారం బోనాలు ఘనంగా సమర్పించారు. ఈ సందర్భంగా మాతాలు ఇంటింటికి బోనం తీస్తూ డప్పు చప్పుల్లు మరియు పోతరాజుల నడుమ భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా వెళ్లి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. రాయికల్లో ప్రథమ పోచమ్మ తల్లికి గత సంవత్సరం పున విగ్రహ ప్రతిష్ట ఏర్పాటు చేసిన సందర్భంగా 11 నెలలలో మారుబోనం తీయడానికి విశ్వబ్రాహ్మణ కులస్తులు అందరూ కలిసి ఐకమత్యంతో ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో గట్టుపల్లి నరహరి, గట్టుపల్లి శ్రీనివాస్, గట్టుపల్లి నర్సయ్య, పెడివెళ్లి నడిపి నర్సయ్య,ఇమ్మడి విజయ్ కుమార్, పెడివెళ్లి అభినవ్, గట్టుపల్లి రవి కిరణ్, గట్టుపల్లి నవీన్ లతోపాటు భక్తులు మాతలు తదితరులు పాల్గొన్నారు.

