Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలప్లాస్టిక్ సంచులు వినియోగంపై వార సంతలో అవగాహన

ప్లాస్టిక్ సంచులు వినియోగంపై వార సంతలో అవగాహన

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:

మల్లాపూర్ మండల కేంద్రం లో వారసంత లో కూరగాయలు అమ్మే వారికి గ్రామపంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ సంచులు  వాడకం తో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నదని, ఈ ప్లాస్టిక్ సంచులు వాడకం సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, దాని వల్ల కలిగే నష్టాలు చాలా ఎక్కువ, భూమిలో కలిసిపోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఇది నేల, నీరు, గాలిని కలుషితం చేస్తుంది,ప్లాస్టిక్ వ్యర్థాలను తినడం వల్ల పశువులు చనిపోతున్నాయి అని అన్నారు. ఈ కార్యక్రమం లో జూనియర్ అసిస్టెంట్ మనోహర్ రెడ్డి,కార్యదర్శి గూరుడు శ్రీనివాస్, వార్డు సభ్యులు ముష్కరి రమేష్, మొరపు గంగా రాజం, ఎనుగంటి నరేష్,శనిగారపు నరేష్, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular