Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలభక్తి భావంతో సాగిన అన్నపూర్ణ అమావాస్య మహా అన్నప్రసాద వితరణ

భక్తి భావంతో సాగిన అన్నపూర్ణ అమావాస్య మహా అన్నప్రసాద వితరణ

📰 Generate e-Paper Clip

కోరుట్లలో సుమారు 800 మంది భక్తులకు అన్నసంతర్పణ

నవగీతం,కోరుట్ల ప్రతినిధి:

సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలోని జవహర్ రోడ్ లో గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో నిర్వహించిన అన్నపూర్ణ అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తి, సేవా భావం, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా అత్యంత ఘనంగా జరిగింది. అమావాస్య అనే పవిత్ర దినాన పితృదేవతల తృప్తి కోసం నిర్వహించిన ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు, భక్తులు విశేషంగా హాజరయ్యారు. సుమారు 800 మందికి పైగా భక్తులు పాల్గొని మహా అన్నప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో స్వీకరించారు. ఆలయ ప్రాంగణం మొత్తం “జై శ్రీరామ్” నామస్మరణతో మార్మోగి ఆధ్యాత్మిక వాతావరణం అలుముకుంది.కార్యక్రమానికి ముందు బ్రహ్మశ్రీ పాలెపు జయరామ శర్మ  వైదిక నిర్వహణలో గోపూజ, అన్నపూర్ణ మాత పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అన్నపూర్ణ మాత కృపాకటాక్షాలతో భక్తులకు మహా అన్నప్రసాద వితరణ జరిగింది. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల ముఖాల్లో కనిపించిన సంతృప్తి, ఆనందం ఈ కార్యక్రమం యొక్క మహత్తును ప్రతిబింబించింది. “అన్నదానం మహాదానం” అనే సనాతన ధర్మ సందేశాన్ని కార్యరూపంలో చూపిస్తూ నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం సమాజంలో సేవా భావాన్ని మరింత పెంపొందించింది. ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం కేవలం దానం మాత్రమే కాకుండా దైవ సేవ అని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సనాతన ధర్మ ప్రచార సమితి అధ్యక్షుడు మంచాల జగన్ మాట్లాడుతూ..“అన్నపూర్ణ మాత కృపతో ప్రతి అమావాస్య రోజున పట్టణంలోని ఏదో ఒక ప్రాంతంలో ఈ అన్నప్రసాద సేవను నిరంతరంగా కొనసాగిస్తాం. భక్తుల సహకారం, దాతల ఆదరణ, స్వచ్ఛంద సేవకుల అంకితభావమే ఈ కార్యక్రమ విజయానికి ప్రధాన కారణం” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ ప్రచార సమితి కార్యదర్శి భట్టు హరికృష్ణ, కోశాధికారి రేగుంట రాజారాం, అన్నపూర్ణ అమావాస్య అన్నప్రసాద కమిటీ చైర్మన్ వనపర్తి చంద్రమోహన్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పడిగెల శ్రీనివాస్, వార్డు కౌన్సిలర్ ఇందూరి తిరుమల వాసు, కమిటీ కన్వీనర్ గంప శివకుమార్, శ్రీరాములు జలేందర్, మంచాల రమేష్, కట్కం రంజిత్, కంఠం సదాశివ్, పల్లెర్ల మహేందర్, రాజేంద్ర ప్రసాద్, ఛిద్రాల వినోద్, లింగ ఉదయ్, అల్లాడి మహేష్,బండ్ల రవి,ఓటరికారి చిన్న రాజన్న, శ్రీపతి రమేష్,ఎలిమిళ్ల మనోజ్, చౌదరి సూర్యకాంత్,దొంతుల రమేష్,కృష్ణప్రహ్లాద్,మానుక రజనీకాంత్ తాటికొండ ఆంజనేయులు, వనపర్తి ఆంజనేయులు, ఆడెపు నరేష్,నార్ల ప్రకాష్, చాడ శ్రీనివాస్, రామగిరి మధు,పదాల గణేష్,కమ్టాల భాస్కర్, అడ్వాల ప్రభాకర్, గరిపెల్లి శ్రీనివాస్ మహిళా సభ్యులు రోజారమణి, రమ్య,వాణి,సుజాత, మాధవి, సునీత, రమ,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular