Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమత్స్యకారులు ఎన్.ఎఫ్.డీ.పీ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి

మత్స్యకారులు ఎన్.ఎఫ్.డీ.పీ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి

📰 Generate e-Paper Clip

– ఫిషర్మెన్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి కల్లేడ నరేష్ కుమార్ సూచన

నవగీతం,హైదరాబాద్:

మత్స్యకారుల సంక్షేమం మరియు వారి హక్కుల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలను పొందాలంటే ప్రతి మత్స్యకారుడు తప్పనిసరిగా ఎన్.ఎఫ్.డీ.పీ (నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫారం) పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలంగాణ ఫిషర్మెన్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కల్లేడ నరేష్ కుమార్ ఒక ప్రకటనలో సూచించారు.ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఈ నెల 23వ తేదీ చివరి గడువు అని, మత్స్యకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

రిజిస్ట్రేషన్ వల్ల కలిగే ప్రయోజనాలు..

ప్రభుత్వ గుర్తింపు : రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి అధికారిక ప్రభుత్వ గుర్తింపు కార్డు లభిస్తుంది.

నేరుగా సబ్సిడీలు : సబ్సిడీపై వలలు, మోటార్ వాహనాలు మరియు ఇతర పరికరాలను నేరుగా పొందే అవకాశం ఉంటుంది.

బీమా సౌకర్యం : ప్రమాద బీమా సౌకర్యం కల్పించబడుతుంది, ఇది మత్స్యకారుల కుటుంబాలకు భరోసానిస్తుంది.

ఆర్థిక సహాయం : బ్యాంకు లోన్లు మరియు కిసాన్ క్రెడిట్ కార్డులు సులభంగా మంజూరవుతాయి.

భవిష్యత్తు పథకాలు : రాబోయే కాలంలో ప్రభుత్వం అమలు చేసే అన్ని సంక్షేమ పథకాలకు ఈ రిజిస్ట్రేషనే ప్రాధాన్యత అవుతుంది.

నమోదు చేసుకోకపోతే కలిగే నష్టాలు : ప్రభుత్వం అందించే రాయితీలు మరియు సబ్సిడీలను కోల్పోయే ప్రమాదం ఉంది.అధికారిక రికార్డులలో మత్స్యకారుడిగా గుర్తింపు ఉండదు. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే బీమా సాయం అందడం కష్టమవుతుంది. మత్స్యకారుల ఖచ్చితమైన సంఖ్య ప్రభుత్వానికి తెలియకపోవడం వల్ల హక్కుల సాధనలో వెనుకబడే అవకాశం ఉంది.

దరఖాస్తు విధానం :ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోని మత్స్యకారులు తమ ఆధార్ కార్డు మరియు మత్స్యశాఖ గుర్తింపు కార్డుతో వెంటనే సమీపంలోని మీ సేవా కేంద్రానికి వెళ్లి నమోదు చేసుకోవాలని నరేష్ కుమార్ కోరారు. మన హక్కులను కాపాడుకుందాం.. మన వృత్తిని గౌరవించుకుందాం అని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular