Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమెట్‌పల్లిలో అక్రమ లేఅవుట్లపై కౌన్సిలర్ల ఫిర్యాదు

మెట్‌పల్లిలో అక్రమ లేఅవుట్లపై కౌన్సిలర్ల ఫిర్యాదు

📰 Generate e-Paper Clip

మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్న రియాల్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి :

మెట్‌పల్లి పట్టణంలో విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ లేఅవుట్లపై పలువురు వార్డు కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ భూములను అక్రమంగా లేఅవుట్లుగా మార్చి విక్రయాలు నిర్వహిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.26వ వార్డు కౌన్సిలర్ బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో 15వ వార్డు కౌన్సిలర్ అరిగెల అనూష-రాకేష్, 16వ వార్డు కౌన్సిలర్ అరిసె వనజ-మురళి, 9వ వార్డు కౌన్సిలర్ బొడ్ల వసుధ-నాగేష్ కలిసి సమర్పించిన వినతిపత్రంలో, మెట్‌పల్లి పట్టణంలోని బచ్‌పన్ స్కూల్ సమీపంలోని సర్వే నంబర్లు 983, 984, 985, 1001లో అక్రమ లేఅవుట్లు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు.దానవేణి అలియాస్ కలర్స్ గంగాధర్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి చుట్టుపక్కల భూములను కొనుగోలు చేసి, ఎలాంటి రహదారులు, లింక్ రోడ్లు లేకుండానే వ్యవసాయ భూములను ప్లాట్లుగా విభజిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అక్రమ లేఅవుట్ల కారణంగా సమీపంలోని రైతులు, భూస్వాములు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.మున్సిపల్ నిబంధనలను పట్టించుకోకుండా అక్రమ లేఅవుట్లు వేస్తూ మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారని, దీనికి సహకరించిన టౌన్ ప్లానింగ్ అధికారులపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అమాయక ప్రజలు ఇలాంటి అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.అక్రమంగా ఏర్పాటు చేసిన హద్దురాళ్లను తక్షణమే తొలగించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లు విజ్ఞప్తి చేశారు. మెట్‌పల్లి పట్టణంలో ఇదొక్కటే కాకుండా మరెన్నో అక్రమ లేఅవుట్లు ఉన్నాయని, వాటిపైనా సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular