Friday, May 1, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమే డే స్ఫూర్తితో హక్కులు సంక్షేమం పరిరక్షణ కోసం కార్మికులు ఐక్యంగా పోరాడాలి

మే డే స్ఫూర్తితో హక్కులు సంక్షేమం పరిరక్షణ కోసం కార్మికులు ఐక్యంగా పోరాడాలి

📰 Generate e-Paper Clip

ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు సుతారి రాములు

నవగీతం, కోరుట్ల ప్రతినిధి:

8 గంటల పని దినం కోసం కార్మిక ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన పోరాట యోధుల సాక్షిగా ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే స్ఫూర్తితో కార్మిక శ్రేణులు ముందుకు సాగాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు సుతారి రాములు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.శుక్రవారం రోజున జగిత్యాల జిల్లా కోరుట్ల డివిజన్ కేంద్రంలో జరిగిన పట్టణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మరియు హమాలీ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ఆధ్వర్యంలో అరుణపతాకలు ఎగురవేసి అమరవీరులకు ఘనంగా నివాళులర్పిస్తూ ఉత్సాహభరితంగా 141 వ మేడే నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ 1886 మే1న అమెరికా దేశంలోని చికాకు పట్టణంలో హే మార్కెట్ లో వేలాదిమంది కార్మికులు సమ్మె చేస్తున్న సందర్భంగా అప్పటి బ్రిటిష్ పాలకులు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరపడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయి రక్తపు మడుగులో తడిసిన నెత్తుటి గుడ్డలే మేడే స్ఫూర్తి అన్నారు నాటి నుండి పోరాడి సాధించుకున్న కార్మిక వర్గపు 29 చట్టాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిలిపివేసి పెట్టుబడుదారులకు ప్రైవేటు శక్తులకు అనుకూలంగా ఐదు లేబర్ కోడులను తీసుకొచ్చి వద్దన్నారు.దీని పరిణామం వల్ల కార్మికులు ఉద్యోగులు భద్రత కోల్పోయి చట్టాలు అమలు కాకుండా నిర్వీర్యం ఐపోతాయని ప్రశ్నించే హక్కు లేకుండా పోతుందని అలాంటి లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం ఏన్నం రాధ అందే వంశీకృష్ణ తిప్పర్తి రమేష్ మొయినుద్దీన్ రామిల్లా రాంబాబు షేక్ చాంద్ పాషా గుండేటి పోశెట్టి కొక్కుల గంగాధర్ సాంబార్ మహేష్ మున్సిపల్ కార్మికులు హమాలీ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు కార్మిక వీధులలో అరుణ పతాకాలు ఎగురవేసి ఘనంగా మే డే ఉత్సవాలు నిర్వహించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular